
రిజిస్ట్రేషన్ శాఖలో అక్రమ నియామకాలు
దరఖాస్తులు స్వీకరించకుండానే ఎంపిక ప్రక్రియ నిరుద్యోగుల ఆశలపై నీళ్లు. నిలుపుదల చేయాలని ప్రజాసంఘాల డిమాండ్ సిరా న్యూస్,వరంగల్; తమరిని అడిగేవారు ఎవరు అన్న ధీమానో ఏమోగానీ ఉమ్మడి వరంగల్ జిల్లాలోని రిజిస్ట్రేషన్ శాఖలో అక్రమ నియామకాల ప్రక్రియ జోరుగా కొనసాగుతుందని విమర్శలు వినిపిస్తున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉన్న సుమారు 15 సబ్ రిజిస్టర్ కార్యాలయాలు ఉన్నాయి. వాటిలోని ఖాళీలను ప్రభుత్వం ఔట్సోర్సింగ్ విధానంలో భర్తీ ప్రక్రియను గతంలో చేపట్టి భర్తీ చేసింది. ఆ క్రమంలో వరంగల్ పోర్ట్ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఖాళీ ఉందన్న కారణంతో ఓ వ్యక్తిని ఔట్సోర్సింగ్ విధానం ద్వారా అప్పట్లో భర్తీ చేసింది. అతను అనారోగ్య కారణాలతో కార్యాలయంకు వెళ్లకపోవటంతో దాన్ని సాకుగా తీసుకున్న స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు ఎలాంటి ప్రకటన చేయకుండా ఆ ఖాళీని భర్తీ చేయడం…
