
అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు
సిరా న్యూస్,కుత్బుల్లాపూర్; భౌరం పెట్ లో వ్యవసాయ భూమిని అమ్మనందుకు కిరాయి గుండాలతో తమ పై దాడి కి యత్నిస్తున్నారని రెండు రోజుల క్రితం దుండిగల్ పోలీస్ స్టేషన్ వెళ్లిన రైతుల ఘటన మరవకముందే,రైతులకు మరో సమస్య వచ్చి పడింది.తమ పైనే కేసులు పెట్టేందుకు వెళ్తారా అని త్రిపుర భవన నిర్మాణ సంస్థ మరియు కొందరు బి అర్ ఎస్ నాయకులు కలిసి అదే రైతుల పై అక్రమ కేసులు బనాయించి జైలు కు పంపుతున్నారని అవేదన వ్యక్తం చేశారు రైతుల కుటుంబ సభ్యులు..బౌరం పేట లోని తమ వ్యవసాయ భూమిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తమ గోడు ను విన్నవించుకున్నారు. బౌరం పెట్ గ్రామానికి చెందిన రైతులను ఏడేళ్ళు గా వేధిస్తున్నారని కోర్టు కార్యాలయాల చుట్టు తిరిగి తమ భూమి లో కి ఎవరు…
