
ముఖ్యమైన ఫైల్స్ పైనే… మంటలు….
సిరా న్యూస్,విజయవాడ; ఏపీలో ఈ మధ్య విద్యుత్ షార్ట్ సర్క్యూట్ ప్రమాదాలు జరిగి ముఖ్యమైన ఫైల్స్ మాత్రమే కాలిపోయే స్కీమ్ నడుస్తుంది. గడిచిన మూడు నెలల కాలంలో ఏపీ లో జరుగుతున్న ప్రమాదాల పై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.గతంలో అగ్ని ప్రమాదం జరిగితే ఇళ్లు, దుకాణాలు, కార్యాలయాలు, అందులోని వస్తువులు ఇలా ఆస్తి నష్టమో లేదా కొన్ని సందర్భాల్లో ప్రాణ నష్టమో జరిగేది. కాని ప్రస్తుతం ఏపీలో జరుగుతున్న అగ్ని ప్రమాదాలు మాత్రం కేవలం ఫైల్స్ మాత్రమే కాలిపోయి సాక్షం లేకుండా అయ్యేలా ప్రమాదాలు జరుగుతుండడం గమనార్హం. ఇలాంటి ప్రమాదాలపై రాష్ట్ర ప్రభుత్వం సైతం సీరియస్ గా దృష్టి పెట్టింది.మొన్న అమరావతి, నిన్న మదనపల్లి, దవళేశ్వరం కార్యాలయం.. నేడు తిరుపతి... అగ్ని ప్రమాదాలు. తిరుమల తిరుపతి దేవస్థానం లో అనేక అవకతవకలు జరిగాయని, తిరుమలను కూడా…
