తాజా వార్తలు

శ్రీశైల క్షేత్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు పరిశీలించిన కార్యనిర్వాహణాధికారి

సిరా న్యూస్,శ్రీశైలం; భక్తుల సౌకర్యార్థం శ్రీశైల క్షేత్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టబడుతున్నాయి. ఇందులో భాగంగా శనివారం రోజు  కార్యనిర్వహణాధికారి సంబంధిత ఇంజనీరింగ్ అధికారులతో కలిసి పలు ప్రదేశాలు పరిశీలించారు. రోడ్లు భవనాలశాఖ అతిథిగృహ కూడలి, ఘంటామఠం కూడలి, విభూతిమఠం కూడలి, వలయరహదారి, పాతాళగంగరోడ్డు, పాతాళగంగ పాతమెట్ల రోడ్డు,సెవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ మొదలైన ప్రదేశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కార్యనిర్వహణాధికారివారు మాట్లాడుతూ ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు రోడ్లు భవనాల శాఖ అతిథిగృహం కూడలి వద్ద వీలైనంత మేరకు రహదారిని ఇరువైపులా విస్తరించేందుకు చర్యలు చేపట్టాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. అదేవిధంగా రుద్రాక్షమఠం, విభూతిమఠం వద్దగల కూడళ్ళ వద్ద గల రహదారిని విస్తరించేందుకు వెంటనే చర్యలు చేపట్టాలన్నారు. రుద్రాక్షమఠం, విభూతిమఠం ప్రాంగణాల ముందు స్వల్ప విస్తీర్ణ ప్రదేశంలో ల్యాండ్ స్కేపింగ్ గార్డెనింగ్ చేపట్టాలని ఉద్యానవన అధికారి లోకేస్…

Read More
3 Dec 2023, 4:52 pmsiranews.in