Telugu Online News Daily
https://siranews.in/
Date of Publish : 14 December 2023, 3:54 pmEditor : Sira News

అనధికారికంగా నావల పోటీలు

పట్టించుకోని అధికార యంత్రాంగం

సిరా న్యూస్,కోనసీమ;
కాట్రేనికోన మండలం బలుసుతిప్ప గ్రామంలో బాహాటంగా నావల లంగరు పోటీలు నిర్వహించారు. పోలీస్, రెవిన్యూ, మత్స్యశాఖల అధికారులు కనిపించకపోవడం విశేషం. గ్రామ కట్టడి ప్రకారం గత పది సంవత్సరాలుగా జరుగుతున్న పోటీలు కు విరుద్ధంగా రూల్స్ వ్యతిరేకించి మరొక వర్గం పోటీలు నిర్వహించారని సమాచారం. కొంతమంది అత్యుత్సాహం ప్రదర్శించి గ్రామ పెద్దలకు వ్యతిరేకంగా పోటీలు నిర్వహించారని గ్రామస్తులు అంటున్నారు. ప్రతి ఏటా జరిగే నావల పోటీల్లో నిబంధనలను పోటీ దారులు బేకాతరు చేసారు.
సుమారు 40 నావలు పైబడి ఈ పోటీలో పాల్గొన్నట్లు సమాచారం. సాంప్రదాయ బద్ధంగా పోలీస్, రెవెన్యూ, మత్స్యశాఖ అధికారులు ఆధ్వర్యంలో పోటీలు జరగాలి. గ్రామాల్లో అనధికారికంగా జరిగే పోటీలు వల్ల వర్గ పోరుకు దారి తీసే ప్రమాదం ఉందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు…

Copyright © 2026 SIRA NEWS. All rights reserved.