Telugu Online News Daily
https://siranews.in/
https://siranews.in/
Date of Publish : 7 March 2024, 5:44 pmEditor : Sira News
తెలంగాణ డ్రగ్ కంట్రోల్ అధికారుల తనిఖీలు..

హైదరాబాద్, మహబూబ్ నగర్ జిల్లాలో డిసిఏ సోదాలు..
పలు రకాల మందులు సీజ్
సిరా న్యూస్,హైదరాబాద్;
హైదరాబాద్ జియోగుడాలో ఇల్లిగల్ గా తయారీ చేస్తున్న కాస్మొటిక్స్ స్థావరంపై తనిఖీలు జరిపారు. నాగ్రిస్ హెర్బ్స్ అనే సంస్థ తయారు చేస్తున్న పకీజా గోల్డ్ మెహందీ కోన్, పాకీజా ఆర్ట్ హెన్నా, పాకీజా ఫాస్ట్ ఆర్ట్ హెన్నా ఇన్స్టంట్ కోన్, పాకీజా ప్యూరిఫైడ్ వంటి బ్రాండ్ పేర్లతో మెహందీ కోన్స్ (హెన్నా పేస్ట్), హెన్నా పౌడర్‌తో సహా కాస్మొటిక్స్ సీజ్ చేసారు. హెన్నా పౌడర్ కాస్మెటిక్ లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్నారు. మహబూబ్ నగర్ లో మూర్ఛ చికిత్స కోసం తప్పుదోవ పట్టించే ప్రకటనలు చేస్తూ జాడీ బూటీ, నరిషింగ్ హెయిర్ ఆయిల్ సీజ్, జడ్చర్లలో బెల్లాకేర్ సిరప్ తో స్త్రీలకు చికిత్స చేస్తున్నందుకు తప్పుదోవ పట్టించే ప్రకటనలు చేసినందుకు సీజ్ చేసారు.
