
ఎన్నికల పనుల్లో చేతి వాటం….
సిరా న్యూస్,హైదరాబాద్; ఎలక్షన్స్ వచ్చాయంటే చాలు వారికి ఫుల్ హ్యపీ.... వాస్తవానికి వారు జీహెచ్ఎంసీలో పనులు చేయించాల్సిన ఇంజినీర్లు. కానీ ఎన్నికలొచ్చాయంటే చాలు వారు కాంట్రాక్టర్లుగా మారిపోతారు. అడపాదడపా పనులు చేయించే లైసెన్స్ కలిగిన కాంట్రాక్టర్లను బినామీలుగా పెట్టుకుని పబ్బం గడుపుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.ఎన్నికలకు సంబంధించి లైటింగ్, వీడియో, డీఆర్సీ సెంటర్లు, పోలింగ్ స్టేషన్ల ఏర్పాటు పనులు, స్ట్రాంగ్ రూమ్ల నిర్మాణం, డీఆర్సీ సెంటర్లలోని సిబ్బందికి భోజనాలు వంటి పనులను కొటేషన్లు, షార్ట్ టెండర్ల ప్రక్రియలతో కేటాయించాలని గత అసెంబ్లీ ఎన్నికలకు ముందే జిల్లా ఎన్నికల అధికారి లిఖితపూర్వకమైన ఆదేశాలు జారీ చేసినా క్షేత్ర స్థాయిలో అవి ఏమాత్రం అమలు కావడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి అడ్డదారిలో ఎలక్షన్స్ పనులు చేజిక్కించుకుని తమ బినామీ కాంట్రాక్టర్లకు కట్టబెడుతూ జీహెచ్ఎంసీ ఇంజినీర్లు, అధికారులు అక్రమార్జనకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.…
