ఆంధ్రప్రదేశ్

టీజీకి పదవి ఖాయమేనా

సిరా న్యూస్,కర్నూలు; ఆంధ్రప్రదేశ్ లో సీనియర్ నేత టీజీ వెంకటేశ్ త్వరలోనే పదవి లభిస్తుందన్న ప్రచారం ఊపందుకుంది. భారతీయ జనతా పార్టీ ఆయనకు అతి త్వరలోనే గుడ్ న్యూస్ చెబుతుందంటున్నారు. ఈ మేరకు హైకమాండ్ వద్ద కూడా ప్రతిపాదనలున్నాయని చెబుతున్నారు. టీజీ వెంకటేశ్ 2014లో కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరారు. అయితే కర్నూలు పట్టణ నియోజకవర్గం నుంచి ఓటమిపాలు కావడంతో ఆయనకు టీడీపీ నుంచి రాజ్యసభ పదవి దక్కింది. టీడీపీలో కీలకంగా ఉన్న టీజీ వెంకటేశ్ తర్వాత 2019 ఎన్నికల్లో టీడీపీ ఏపీలో ఓటమి పాలయిన తర్వాత నలుగురు రాజ్యసభ సభ్యులతో పాటు ఆయన కూడా బీజేపీలో చేరిపోయారు.ఆయన బీజేపీలోనే కొనసాగుతున్నారు. రాజ్యసభ సభ్యుడిగా ఆయన బీజేపీ పెద్దలను ఆకట్టుకున్నారు. వారి దృష్టిలో పడ్డారు. టీజీ వెంకటేశ్ కేవలం సామాజికవర్గం పరంగా మాత్రమే కాకుండా ఆర్థికంగా బలవంతుడు…

Read More
10 Oct 2024, 10:50 amsiranews.in