Telugu Online News Daily
https://siranews.in/
Date of Publish : 3 October 2024, 5:25 pmEditor : Sira News

ఎల్ఓసి మంజూరు చేయించిన ఐటి మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు

-బాధితురాలి చికిత్స కోసం రూ.2 లక్షల 50వేల ఎల్ఓసి పత్రాలు అందజేత
 సిరా న్యూస్,మంథని;
మంథని మండలం నాగేపల్లి గ్రామానికి చెందిన కొలకని పద్మ బ్లడ్ ఇన్ఫెక్షన్ కి సంబంధించిన అనారోగ్యంతో నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతు సహాయం కొరకు తెలంగాణ రాష్ట్ర ఐటి, పరిశ్రమల మరియు శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ను సంప్రదించగా వెంటనే స్పందించిన ఆయన ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా వైద్య ఖర్చుల నిమిత్తo వీరికి రూ.2 లక్షల 50వేల ఎల్ఓసి మంజూరు చేయించారు. గురువారం మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆస్పత్రి సహాయకులు వారికి హైదరాబాద్ లోని క్యాంపు కార్యాలయంలో ఎల్ఓసి పత్రాలను అందజేశారు.రెండు లక్షల 50 వేల ఎల్ఓసి మంజూరు చేపించి అండగా నిలిచినా మంత్రి శ్రీధర్ బాబు కు కొలకని పద్మ కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు.

Copyright © 2026 SIRA NEWS. All rights reserved.