
గుమ్మనకు ఎదురీత తప్పదా
సిరా న్యూస్,కర్నూలు; ఆలూరు నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసి ఐదేళ్ల పాటు మంత్రిగా పనిచేసిన గుమ్మనూరి జయరాంకు ఈసారి మాత్రం గెలుపు అంత సులువుగా మాత్రం లేదు. బోయ సామాజికవర్గానికి చెందిన గుమ్మనూరి జయరాం పై ఎన్ని ఆరోపణలు వచ్చినా సరే.. జగన్ తన కేబినెట్ లో కొనసాగించారు. ఆయన కుటుంబ సభ్యులపైన కూడా ఆరోపణలు అనేకం వినిపించాయి. అంతేకాదు పేకాట క్లబ్ లు నిర్వహిస్తున్నారని స్వయంగా టీడీపీ నేతలే విమర్శించారు. అయితే గుమ్మనూరిని ఈ ఎన్నికల్లో వైసీపీ ఆలూరు నుంచి తప్పించి ఆయనకు కర్నూలు పార్లమెంటుకు పోటీ చేయాలని చెప్పడంతో ఆయన మనస్తాపానికి గురై టీడీపీలో చేరిపోయారు.ఆర్థికంగా, సామాజికంగా బలమైన నేత కావడంతో గుమ్మనూరి జయరాంను టీడీపీ సాదరంగా ఆహ్వానించింది. అయితే ఆయన కోరుకున్నట్లు ఆలూరు టిక్కెట్ మాత్రం టీడీపీ నాయకత్వం ఇవ్వలేదు. గుంతకల్లులో…
