
ధర్టీ ఇయర్ ఇండస్ట్రీకి కష్టకాలం తప్పదా
సిరా న్యూస్,నిజామాబాద్; ఎంత పనైపోయింది అధ్యక్ష. పెద్ద కుర్చీలో కూర్చుని.. గులాబీ దళపతితోనే లక్ష్మీ పుత్రుడని పిలిపించుకున్న పోచారానికి…సొంత నియోజకవర్గంలో కుంపటి కాకపుట్టిస్తోంది. బీఆర్ఎస్‌లో ఉన్నప్పుడు హవా నడిపించిన మాజీ మంత్రి, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి..కాంగ్రెస్‌లో కూడా అదే రేంజ్‌లో రాజకీయాలు నడిపిద్దామంటే పప్పులు ఉడకడం లేదట. దీంతో గత కొంతకాలంగా రగిలిపోతున్న పెద్దాయన… ఓ మాట అనేస్తే పోలా..అందరూ సైలెంట్ అయిపోతారని స్కెచ్ వేశారట.ఇంకేముంది తనకు కళ్లలో నలుసులా మారిన అసమ్మతి నేత, బాన్సువాడ కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి మీద బాణం ఎక్కుపెట్టారు. అయితే అది కాస్త రివర్స్ అయి పోచారం వైపే దూసుకువస్తుండటంతో ఇప్పుడు పెద్దాయనకు ఏం చేయాలో పాలు పోవడం లేదట. అంతేకాదు మరో కొత్త బాణం బీఆర్ఎస్ నుంచి కూడా పోచారం వైపే దూసుకువస్తుండటంతో…
