తెలంగాణ

Jadhav Anil: వడదెబ్బకు గురైన బోథ్‌ ఎమ్మెల్యే జాదవ్ అనిల్

సిరాన్యూస్,బోథ్‌ వడదెబ్బకు గురైన  బోథ్‌ ఎమ్మెల్యే జాదవ్ అనిల్ * ప‌రామ‌ర్శించిన బోథ్‌ ఎంపీపీ తుల శ్రీనివాస్ ఆదిలాబాద్ జిల్లా బోథ్‌ నియోజకవర్గం ఎమ్మెల్యే జాదవ్ అనిల్ వడదెబ్బకు గురయ్యారు. గత రెండు రోజులుగా తీవ్రమైన ఎండల లో ప్రచారం నిర్వహించడంతో వడదెబ్బబారిన ప‌డ్డారు. దీంతో ఆయన స్వగృహంలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న బోథ్‌ ఎంపీపీ తుల శ్రీనివాస్ పరామర్శించారు. కాగా ఎండల తీవ్రత వల్ల కార్యకర్తలు ఉదయం, సాయంత్రం పూట ఎన్నికల ప్రచారం నిర్వహించుకోవాలని ఎమ్మెల్యే కోరారు. వడ దెబ్బకు గురి కాకుండా కార్యకర్తలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.

Read More
26 Apr 2024, 6:09 pm
Updated: 26 Apr 2024, 6:09 pm
siranews.in