
జగన్ విదేశీ పర్యటన..
ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో డిఫరెంట్ చర్చ సిరా న్యూస్,విజయవాడ; జగన్ విదేశీ పర్యటన నుంచి వచ్చేసరికి వైసిపి ఖాళీ అవుతుందా? ఆ పార్టీని వీడేందుకు చాలామంది సిద్ధంగా ఉన్నారా?తెర వెనుక ఏదో జరుగుతోందా? ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది. టిడిపి అనుకూల మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. జగన్ కుటుంబ సమేతంగా లండన్ వెళ్ళనున్నారు.దాదాపు 20 రోజులు పాటు అక్కడే ఉంటారు. కూతురి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొంటారు. విదేశాలకు వెళ్లేందుకు ఇప్పటికే సిబిఐ అనుమతి తీసుకున్నారు జగన్. ఈరోజు తండ్రి రాజశేఖర్ రెడ్డి వర్ధంతి కావడంతో ఇడుపాలపాయలో నివాళులు అర్పించారు. ప్రత్యేక విమానంలో లండన్ వెళ్ళనున్నారు. గత మూడు రోజులుగా పులివెందుల నియోజకవర్గంలోనే జగన్ గడిపారు. తిరిగి ఈనెల 25న రాష్ట్రానికి రానున్నారు. అయితే ఆయన వచ్చే సమయానికి వైసీపీని అడ్డగోలుగా…
