
Jainath EGS: జైనథ్ ఉపాధి హామీలో అక్రమాలు…?!
సిరా న్యూస్, జైనథ్: జైనథ్ ఉపాధి హామీలో అక్రమాలు...?! + సామాజిక తనిఖితో వెలుగులోకి + పూర్తి అయిన ప్రజావేధిక + జీపీల వారీగా అక్రమాల లెక్క తేలుస్తున్న అధికారులు ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలో 2022–23 ఆర్థిక సంవత్సరంలో నిర్వహించిన ఉపా«ధి హామీ పనుల్లో అక్రమాలు చోటుచేసుకున్నట్లు ఆడిట్ బృంధం తేల్చారు. నెల రోజుల పాటు గ్రామ పంచాయతీల్లో నిర్వహించిన తనిఖీల్లో భాగంగా పలు అక్రమాలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. కాగా మంగళవారం మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజా వేధికలో ఈ మేరకు ఆడిట్ బృందం గ్రామ పంచాయతీల వారీగా నివేధికలను చదివి వినిపించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డీఆర్డీవో సాయన్న నివేధికలను క్షుణ్ణంగా పరిశీలించి, గ్రామ పంచాయతీల వారీగా అక్రమాలకు సంబంధించిన అంతిమ నివేధికలు సిద్దం చేసినట్లు సమాచారం.…
