
హిందూ ఫేస్ గా మారుతున్న జనసేనాని….
సిరా న్యూస్,విజయవాడ; సనాతన ధర్మ పరిరక్షణకు ప్రత్యేక బోర్డు ఉండాలి.. దీనిపై దేశవ్యాప్తంగా విస్తృతంగా .. అన్ని వర్గాల్లో చర్చ జరగాలి అని జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ తిరుమల లడ్డూ వివాదం విషయంలో స్పందించారు. ఈ స్పందన వెనుక లోతైన అర్థం ఉండటంతో పలువురు స్పందించారు. ఇందులో ప్రకాష్ రాజ్ ఒకరు. పవన్ కల్యాణ్ ఈ విషయాన్ని దేశవ్యాప్తంగా చేసి.. సనాతన ధర్మాన్ని పరిరక్షించడానికి ఓ బోర్డును ఏర్పాటు చేయాలన్న సూచన చేశారు. ఇలాంటివి వస్తే.. హిందూత్వ రాజకీయాలు చేసే బీజేపీ ఎలా అందుకుంటుందో ప్రకాష్ రాజ్ కు తెలుసు. అందుకే.. అధికారంలో ఉన్నారు కాబట్టి తప్పు ఎక్కడ జరిగిందో తెలుసుకుని శిక్షించాలని సలహా ఇచ్చారు. దీనికి పవన్ రిప్లయ్ ఇవ్వలేదు కానీ .. ఆయన రాజకీయంపై మాత్రం అందరికి ఈ క్లారిటీ వచ్చినట్లయింది. తిరుమల…
