
బీహారే లక్ష్యంగా జన సూరజ్ పార్టీ అడుగులు
సిరా న్యూస్,పాట్నా; ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్..పూర్తిస్థాయిలో రాజకీయనేతగా మారిపోయారు. సుదీర్ఘకాలం వ్యూహకర్తగా దేశంలోని అనేక రాజకీయ పార్టీలకు సేవలు అందించారు. ప్రధాన పార్టీలు అధికారంలోకి రావడానికి తన వంతు చేయూతనందించారు. గత కొంతకాలంగా వ్యూహకర్త వృత్తి నుంచి బయటకు అడుగులు వేసిన ఆయన.. స్వరాష్ట్రంలో ఈరోజు రాజకీయ పార్టీని ప్రారంభించారు. దానికి జన సూరజ్ పేరును ప్రకటించారు. త్వరలో బీహార్ లో తన పార్టీ అధికారంలోకి వస్తుందని ఆకాంక్షించారు.గాంధీ జయంతి సందర్భంగా పాట్నాలో సన్నిహితుల నడుమ నూతన పార్టీ గురించి ప్రకటన చేశారు. దీంతో వచ్చే ఏడాది బీహార్ ఎన్నికల్లో మరో రాజకీయ పార్టీ తన అదృష్టాన్ని పరీక్షించుకోనుదన్నమాట. బీహార్ లోని సాసారాం ప్రాంతానికి చెందిన ప్రశాంత్ కిషోర్ 2014 లోక్సభ ఎన్నికల్లో బిజెపి వ్యూహకర్తగా పనిచేశారు. బిజెపి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి…
