
అంతుచిక్కని జనసేనాని వ్యూహం…
సిరా న్యూస్,గుంటూరు; జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎన్నికలకు ముందు తరహాలోనే మళ్లీ ఆవేశంతో ఉన్నారు. ఎన్నికల సమయంలో ఒకింత నాటి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పవన్ కల్యాణ్ ప్రతి సభలో శపథం చేశారు. జగన్ ను అథ:పాతాళానికి తొక్కేస్తానని ప్రకటించి సంచలనమే సృష్టించారు. అలాగే జగన్ ప్రభుత్వాన్ని కూల్చివేస్తానని ప్రతిన బూనారు. అన్నట్లుగానే కూటమిని ఏర్పాటు చేయడంలో పవన్ కల్యాణ్ కీలకంగా వ్యవహరించారు. నిజానికి పవన్ కల్యాణ్ లేకుంటే కూటమి ఏర్పాటు సాధ్యమయ్యేది కాదు. పవన్ వల్లనే కూటమి అధికారంలోకి వచ్చిందని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు. దీనికి తోడు కాపు + కమ్మ క్యాస్ట్ ఈక్వేషన్ కూడా బలంగా పనిచేసింది. చంద్రబాబును జైల్లో వేసిన సానుభూతి కూడా కొంత పనిచేసింది పవన్ కల్యాణ్ అనుకున్నట్లుగానే కూటమి అధికారంలోకి వచ్చింది. వంద రోజుల పాలన…
