తాజా వార్తలు

జయజయహే తెలంగాణ

 సిరా న్యూస్,హైదరాబాద్; ఢిల్లీలో జరిగే రిపబ్లిక్ డే వేడుకలకు తెలంగాణ కనువిందు చేసేందుకు సిద్ధమవుతుంది. దాదాపు మూడేళ్ల తరువాత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చొరవ తీసుకోవడంతో తెలంగాణ శకటం గణతంత్ర వేడుకల్లో ప్రదర్శనకు రాబోతోంది. ‘జయ జయహే తెలంగాణ’ అని శకటానికి పేరు పెట్టారు. ప్రజాకవి అందెశ్రీ రాసిన ఈ పాట తెలంగాణ ఉద్యమం సమయంలో మరింత జోష్ నింపింది. సుమారు మూడేళ్ల తర్వాత తెలంగాణ శకటం గణతంత్ర వేడుకల్లో ప్రదర్శనకు రాబోతుండటంతో థీమ్ కూడా ఇప్పుడు మరింత ఆసక్తికరంగా మారింది. ఈనెల 26న ఢిల్లీ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో కర్తవ్య్‌పథ్‌లో వికసిత్ భారత్ థీమ్‌లో భాగంగా తెలంగాణ శకటాన్ని ప్రదర్శించబోతున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటయ్యాక కేవలం 2015, 2020 సంవత్సరాల్లో మాత్రమే ఈ వేడుకల్లో పాల్గొంది. ప్రజల హక్కులు, ప్రజాస్వామ్య విలువలు కాపాడే దిశగా తెలంగాణ…

Read More
25 Jan 2024, 5:05 pmsiranews.in