
Jogu Ramanna: ఆధ్యాత్మిక చింతనతో ప్రశాంతత
సిరాన్యూస్,బేల ఆధ్యాత్మిక చింతనతో ప్రశాంతత * మాజీ మంత్రి జోగు రామన్న * బోరిగవ్ గ్రామంలో హనుమాన్ విగ్రహ ప్రతిష్టాపన ఆధ్యాత్మిక చింతనతో ప్రశాంతత ఉంటుందని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని మసాలా కె గ్రామ పంచాయతీలోని బోరిగవ్ గ్రామంలో నూతనంగా నిర్మించిన హనుమాన్ ఆలయ విగ్రహ ప్రతిష్టాపన కు సోమవారం మాజీ మంత్రి జోగు రామన్న ముఖ్యఅతిథిగా హాజరయ్యరు.అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ఏర్పాటుచేసిన సమావేశంలో జోగు రామన్న మాట్లాడుతూ తన సొంత డబ్బులు రు.9 లక్షలు వేచ్చించి గ్రామంలో హనుమాన్ ఆలయన్ని నిర్మించిన సతీష్ ప్రకాష్ పవర్( జెడ్పిటిసి బేల) వారి కుటుంబ సభ్యులందరికీ ఆంజనేయ స్వామి దేవుని ఆశీస్సులు ఎల్లవేళలా ఉంటాయని పేర్కొన్నారు.సొంత డబ్బులు తొమ్మిది లక్షలు ఖర్చుచేసి ఆలయం…
