తాజా వార్తలు

Joguramanna: హామీలు నెరవేర్చ‌క‌పోతే పోరాటాలు చేస్తాం : మాజీ ఎమ్మెల్యే జోగురామ‌న్న

సిరాన్యూస్‌, ఆదిలాబాద్‌ హామీలు నెరవేర్చ‌క‌పోతే పోరాటాలు చేస్తాం : మాజీ ఎమ్మెల్యే జోగురామ‌న్న ప్ర‌భుత్వం రైతుల‌కు ఇచ్చిన ప్ర‌తి హామీని నెర వేర్చాల‌ని, లేని ప‌క్షంలో పోరాటాలు చేస్తామ‌ని మాజీ మంత్రి, బీ.ఆర్.ఎస్ జిల్లా అధ్యక్షులు జోగురామన్న అన్నారు. శ‌నివారం బీఆర్ ఎస్ ఇచ్చిన పిలుపు మేర‌కు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం రైతు దీక్ష చేపట్టారు. జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ వద్ద జరిగిన దీక్షలో పార్టీ శ్రేణులతో పాటు రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంతో తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈమేరకు మాజీ మంత్రి జోగురామన్న మాట్లాడుతూ ఆరు గ్యారెంటీల‌తో ఆరుకాలం కష్టపడే రైతులను నట్టేట ముంచేస్తుంద‌న్నారు. అన్నదాతలు ఏళ్ళుగా ఎదుర్కుంటున్న కష్టాలను దూరం చేసి వారిని అక్కున చేర్చుకున్నామని, గత…

Read More
6 Apr 2024, 4:35 pmsiranews.in