
Joguramanna: ఆధ్యాత్మిక చింతనతోనే మానసిక ప్రశాంతత :మాజీ మంత్రి జోగురామన్న
సిరాన్యూస్, జైనథ్ ఆధ్యాత్మిక చింతనతోనే మానసిక ప్రశాంతత :మాజీ మంత్రి జోగురామన్న * సమస్త ప్రజానీకం సుభిక్షంగా జీవించాలి * కేదార్ పూర్లో ఘనంగా హనుమాన్ ఆలయ విగ్రహ ప్రతిష్టాపన ఆధ్యాత్మిక చింతనతోనే మానసిక ప్రశాంతత లభిస్తుందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు, మాజీ మంత్రి జోగురామన్న అన్నారు. ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం కేదార్ పూర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన హనుమాన్ ఆలయ విగ్రహ ప్రతిష్టాపన వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా ఆలయానికి వచ్చిన ఆయనకు నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపారు. ఆంజనేయ స్వామిని ప్రత్యేక హారతులతో కొలిచి... వేద పండితుల ఆశీర్వచనాలను స్వీకరించారు. హోమాది క్రతువుల్లో పాల్గొన్నారు. విగ్రహ ప్రతిష్టాపనను పురస్కరించుకుని నిర్వహిస్తున్న వేడుకల వివరాలను ఆలయ కమిటీ సభ్యులు వివరించారు. ఈ మేరకు…
