Telugu Online News Daily
https://siranews.in/
Date of Publish : 1 May 2024, 1:40 pmEditor : SIRA NEWS

Joguramanna: దోస వేసి..ఓట్లు అభ్య‌ర్థించిన మాజీ మంత్రి జోగురామ‌న్న

సిరా న్యూస్, ఆదిలాబాద్‌
దోస వేసి..ఓట్లు అభ్య‌ర్థించిన మాజీ మంత్రి జోగురామ‌న్న

ఎంపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ మంత్రి జోగురామ‌న్నదోస వేసి ఓట్లు అభ్యర్థించారు. బుధవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో వార్డ్ నెంబర్ 10 కుమ్మరి పేట్ తో పాటు మరిన్ని వార్డులను కార్యకర్తలతో కలిసి గడపగడపకు విస్తృతంగా తిరుగుతూ ఓటర్లను కలుస్తూ ప్రచారాన్ని కొనసాగించారు. పలుచోట్ల ఆయా కుల వృత్తుల పనులు చేస్తూ ఓటర్లను ఆకట్టుకున్నారు. ఆత్రం సక్కు ను గెలిపించాలని కోరారు.అనంతరం జోగు రామన్న మాట్లాడుతూ రాజకీయాల్లోకి దేవుళ్ళ ప్రస్తావన ఎందుకు తెస్తున్నారో కాంగ్రెస్, బీజేపీ లను ఆదిలాబాద్ మాజీ మంత్రి జోగు రామన్న ప్రశ్నించారు. బీజేపీ నాయకులు రాముడు పేరు చెబుతూ రాజకీయం చేస్తుంటే కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి దేవుడి పేర్లపై ఒట్లు పెడుతూ రాజకీయం చేయడం మానుకోవాలన్నారు. స్థానిక ఎమ్మెల్యే బీసీలపై మాట్లాడటం హాస్యస్పదంగా ఉందన్నారు. ఎంపీ ఎన్నికలలో బిజెపి బీసీలకు సీట్లు కేటాయించదు, మంత్రి విస్తీర్ణంలో బీసీలకు సీట్ ఇవ్వదు కానీ బీసీలపై ప్రేమ ఉన్నట్టు మాట్లాడటం కొత్తరకం నాటకం అన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలోబీసీల అభ్యున్నతికి ఉన్నత విద్యను అందించేలా బీసీ గురుకురాలతో పాటు, చట్టసభలలో మహిళలకు రిజర్వేషన్ కల్పించాలని తీర్మానం చేసిన ఏకైక వ్యక్తి మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. ఆదిలాబాద్ పర్యటనకు వచ్చిన భారత ప్రధాని మోదీ ఆదిలాబాద్ ప్రజలకు బీసీలకు ఎలాంటి హామీలు ఇచ్చారో ఆత్మ విమర్శన చేసుకోవాలని సూచించారు. మహిళల అకౌంట్లో 15 లక్షలు వేస్తామని మహిళా ఆత్మగౌరవాన్ని దెబ్బతీసింది మోదీ కాదా అని ప్రశ్నించారు. జంతువులకు లెక్కలు ఉన్నాయి కానీ బీసీ ఆత్మగౌరానికి గుర్తింపు కల్పించడం లేదని జోగు రామన్న మండిపడ్డారు. విశ్వకర్మ యోజన పెన్షన్లు. గ్యాస్ ధరలతో పాటు. బీసీ రేంబర్స్మెంట్ కల్పించడంలో బీజేపీ ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందన్నారు. టిఆర్ఎస్ తరఫున ప్రజల పక్షాన ఉద్యమించి ప్రజలకు రావాల్సిన సంక్షేమ పథకాలను రాబట్టుకునే వరకు ఉద్యమిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలోపట్టణ అధ్యక్షులు అజయ్, సాజితుద్దీన్ ,మహిళా అధ్యక్ష కార్యదర్శులు స్వరూప మమత, పర్వీన్, కౌన్సిలర్లు అశోక్ స్వామి, సంద నర్సింగ్, కోవా రవి,వెనుగంటి ప్రకాష్, పవన్ నాయక్, ధర్మ పాల్, కొండ గణేష్, పందిరి భూమన్న, రామ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు,

Copyright © 2026 SIRA NEWS. All rights reserved.