
Joguramanna: వసూళ్లకు పాల్పడుతున్న బీజేపీ నాయకులు: మాజీ మంత్రి జోగురామన్న
సిరాన్యూస్, ఆదిలాబాద్ వసూళ్లకు పాల్పడుతున్న బీజేపీ నాయకులు: మాజీ మంత్రి జోగురామన్న * ఆత్రం సక్కును భారీ మెజార్టీ తో గెలిపించాలి ఎన్నికల్లో గెలవక ముందే కొంత మంది బీజేపీ నాయకులు వసూళ్లకు పాల్పడుతున్నారని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు, మాజీ మంత్రి జోగురామన్న అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలోని పలువురు బీజేపీ కీలక నేతల తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బీజేపీకి చెందిన ముగ్గురు కీలక నేతలు పాన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపనీ లాగా మారి ఎన్నికల చందాలను వసూలు చేస్తున్నారన్న విషయం పత్రికల్లో వచ్చిందన్నారు. పాన్ గ్యాంగ్ గా ఏర్పడి లోక్ సభ ఎన్నికల వేల బీజేపీకి చెందిన ప్రధాన నేతలు వసూళ్ళకు పాల్పడుతూ వ్యాపారులను ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు.…
