
Joguramanna: ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలం: మాజీ మంత్రి జోగురామన్న
సిరాన్యూస్,ఆదిలాబాద్ ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలం: మాజీ మంత్రి జోగురామన్న * ఢిల్లీ పర్యటనలకు పరిమితమైన సీఎం ఆరు నెలల కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ప్రజలంతా తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తోందని మాజీ మంత్రి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జోగురామన్న అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో పార్టీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిపై ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం మినహాయించి ప్రభుత్వం ఏ ఒక్క హామీని అమలు చేయడం లేదని ఆరోపించారు. పక్క రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన నూతన ప్రభుత్వం రోజుల వ్యవధిలోనే అన్ని హామీలను అమలు చేస్తోందని, కాని తెలంగాణలో మాత్రం కాంగ్రెస్ పాలన పూర్తిగా గాడి తప్పిందని మండిపడ్డారు. వంద…
