
Joguramanna: ఆదివాసి సంక్షేమానికి తొలి ప్రాధాన్యత బీఆర్ఎస్
సిరాన్యూస్,బేల ఆదివాసి సంక్షేమానికి తొలి ప్రాధాన్యత బీఆర్ఎస్ * మహనీయుల ఆశయ సాధనకు కృషి చేయాలి * బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జోగురామన్న * ఆదివాసిలతో కలిసి సందడి చేసిన జోగురామన్న * భీం విగ్రహం ఆవిష్కరణ జల్, జంగల్, జమీన్ నినాదంతో పోరాడిన ఆదివాసి పోరాటయోధుడు కొమరం భీం ఆశయాలకు అనుగుణంగా గత బీ.ఆర్.ఎస్ ప్రభుత్వం ఆదివాసి సంక్షేమానికి తొలి ప్రాధాన్యతను ఇచ్చిందని మాజీ మంత్రి, బీ.ఆర్.ఎస్ జిల్లా అధ్యక్షులు జోగురామన్న అన్నారు. ఆదిలాబాద్ జిల్లా బేల మండలం మసాలా గ్రామంలో ఏర్పాటు చేసిన కొమరం భీం విగ్రహాన్ని శనివారం ఆయన లాంచనంగా ఆవిష్కరించారు. గ్రామస్తుల సమక్షంలో భీం విగ్రహాన్ని అట్టహాసంగా ఆవిష్కరించి నినాదాలతో హోరెత్తించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆదివాసి సంప్రదాయాలకు అనుగుణంగా వారితో కలిసి నృత్యాలు చేస్తూ సందడి చేశారు. ఆదివాసిల…
