తెలంగాణ

Joguramanna: కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతులే బుద్ధి చెబుతారు:  మాజీ మంత్రి జోగురామ‌న్న‌

సిరాన్యూస్, ఆదిలాబాద్‌ కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతులే బుద్ధి చెబుతారు:  మాజీ మంత్రి జోగురామ‌న్న‌ రైతన్నలతోనే కాంగ్రెస్‌ ప్రభుత్వ పతనం ఖాయమని మాజీ మంత్రి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జోగురామన్న అన్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని పార్టీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో పలువురు నేతలతో కలిసి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ విధి విధానాలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రైతుభరోసా పెట్టుబడి సహాయం గురించి ప్రజాభిప్రాయ సేకరణ పేరిట ప్రభుత్వం కాలయాపన చేస్తూ ఆ నగదునే రుణమాఫీ కింద చెల్లించిందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న రైతు వ్యతిరేక మోసాలను యావత్ రైతాంగం గమనిస్తుందని, రైతు భరోసా కింద అందించాల్సిన పెట్టుబడి సహాయాన్ని రుణమాఫీకి మళ్ళించి రాష్ట్ర రైతాంగాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తోందని తెలిపారు. రుణమాఫీ ప్రక్రియలోనూ అనేక మంది రైతులకు న్యాయం జరగడం లేదని ఆరోపించారు. రైతు…

Read More
20 Jul 2024, 6:06 pmsiranews.in