
Joguramanna: సమాజ హితం కోసం కృషి చేస్తా :మాజీ మంత్రి జోగురామన్న
సిరాన్యూస్, ఆదిలాబాద్ సమాజ హితం కోసం కృషి చేస్తా :మాజీ మంత్రి జోగురామన్న * ఘనంగా అన్న బావు సాఠె కమిటీ వ్యవస్థాపక గంగారం వాగ్మారే వర్ధంతి ప్రతినిత్యం ఉన్నతమైన ఆలోచనలు కలిగి ఉంటూ సమాజ హితం కోసం పని చేసిన వారు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారని మాజీ మంత్రి జోగురామన్న అన్నారు. అన్న బావు సాఠె కమిటీ వ్యవస్థాపక అధ్యక్షులు గంగారం వాగ్మారే ప్రథమ వర్ధంతి కార్యక్రమాన్ని బుధవారం స్థానిక ఆదిలాబాద్ పట్టణంలోని పిట్టల వాడలోని మాంగ్ సమాజ్ కమిటి హాల్ ప్రాంగణంలో నిర్వహించారు. కార్యక్రమ ముఖ్య అతిథిగా మాజీ మంత్రి జోగురామన్నహాజరై గంగారం వాఘ్మారే చిత్రపటం వద్ద పుష్పాంజలి ఘటించి నివాళి సమర్పించారు. అంతకుముందు కమిటి హాల్ నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించారు. కమిటి ప్రతినిధులు నిర్మాణ వివరాలను ఆయనకు వివరించారు. అనంతరం గంగారం…
