
జనసేనలో చేరికలు.. గుర్రుగా కూటమి నేతలు
సిరా న్యూస్,ఒంగోలు; ప్రస్తుతం టీడీపీలో లీడర్ షిప్ కు కొదవలేదు. ఫుల్ టైట్ గా ఉంది. అయితే వైసీపీ అసంతృప్తుల్లో చాలా మంది జనసేనవైపు చూస్తుండడం ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారుతోంది. అటు జనసేనకు కూడా పెద్ద నాయకుల అవసరం ఉంది. రాజకీయాల్లో వలసలు కామన్. కలిసి వచ్చే వారిని కలుపుకొని పోవడమూ అంతే కామన్. అయితే ఈ వలసలు కాస్తా కూటమి ప్రభుత్వానికి ఎంత వరకు ఎఫెక్ట్ చూపుతాయన్నది కీలకంగా మారింది. కూటమి పరిణామాలు మారుతాయా? ఇబ్బంది రాకుండా డీల్ చేస్తారా అన్నది హాట్ టాపిక్ అవుతోంది.వైసీపీ నుంచి వలసలు ఆటోమేటిక్ గా కూటమివైపు వస్తున్నాయి. అక్కడ గుడ్ బై చెబుతున్న వారు అయితే టీడీపీ లేదంటే జనసేన వైపు చూస్తున్నారు. ముఖ్యంగా టీడీపీతో గతంలో చాలా విబేధించిన వారైతే తమకు ఆప్షన్ గా జనసేనను…
