
ఏపీపీఎస్సీపై జోకులు… సర్వర్లు డౌన్
సిరా న్యూస్,విజయవాడ; ఎన్నికల ఏడాదిలో వైసీపీ ప్రభుత్వం రెండు కీలక నోటిఫికేషన్లు విడుదల చేసింది. ఏపీపీఎస్సీ ద్వారా గ్రూప్-1, గ్రూప్-2 నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. ఇందులో గ్రూప్-2 కి సంబంధించి దరఖాస్తులు ఆన్ లైన్ లో స్వీకరిస్తున్నారు. గ్రూప్-1 దరఖాస్తుల ప్రక్రియ జనవరి-1 నుంచి మొదలవుతుంది. అయితే ఈ దరఖాస్తులు అప్ లోడ్ చేసే క్రమంలో ఉద్యోగార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అభ్యర్థులెవరైనా ఆన్ లైన్ లో దరఖాస్తు నింపాలంటే ముందుగా వన్ టైమ్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన ప్రక్రియ పూర్తి చేయాలి. గతంలో పోటీ పరీక్షలు రాసినవారు ఆల్రడీ ఈ OTPR పూర్తి చేసి ఉంటారు. కొత్తగా అప్లై చేసేవారు వారి ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ని తొలిసారి పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇక్కడే అసలు సమస్య మొదలవుతుంది. ఈ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ సమయంలోనే సర్వర్ స్లో అవుతోంది. ఫొటో,…
