
కాళేశ్వరం ఎస్ఐ భవాని సేన్ ను సర్వీస్ నుండి శాశ్వతంగా తొలగింపు
మల్టీజోన్ ఐజిపి ఏవి రంగనాథ్ సిరా న్యూస్,కాలేశ్వరం; మహిళా పోలీస్ కానిస్టేబుల్ పై లైంగిక దాడులకు పాల్పడినందు గాను కాళేశ్వరం ఎస్ఐ భవాని సేన్ ను సర్వీస్ నుండి శాశ్వతంగా తొలగిస్తూ మల్టీ జోన్ 1 ఐ జి పి శ్రీ ఏ. వి. రంగనాథ్ బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. కాళేశ్వరం పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న మహిళా హెడ్ కానిస్టేబుల్ పై స్టేషన్ ఎస్. ఐ భవాని సేన్ తుపాకీ చూపించి లైంగిక దాడికి పాల్పడినట్లు సదరు మహిళా హెడ్ కానిస్టేబుల్ పోలీస్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో భూపాలపల్లి ఎస్పీ చేపట్టిన విచారణలో ఎస్ ఐ, మహిళా హెడ్ కానిస్టేబుల్ పై లైంగిక దాడికి పాల్పడినట్లుగా నిజ నిర్ధారణ కావడంతో పాటు ఎస్ ఐ, భవాని సేన్ గత 2022 జులై మాసంలో లైంగిక వేధింపులకు…
