Telugu Online News Daily
https://siranews.in/
Date of Publish : 1 August 2024, 7:34 pmEditor : SIRA NEWS

Kandi Srinivasa Reddy: తప్పుడు ప్రచారం చేసే వారిపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తా :కంది శ్రీ‌నివాస రెడ్డి

సిరాన్యూస్‌, ఆదిలాబాద్
తప్పుడు ప్రచారం చేసే వారిపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తా :కంది శ్రీ‌నివాస రెడ్డి

ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యం తో సేవే మార్గం గా రాజకీయాల్లోకి వచ్చిన త‌న‌పై రాజకీయ ప్రత్యర్థుల కుట్రలు కొన‌సాగుతున్నాయ‌ని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇఛార్జి కంది శ్రీనివాస రెడ్డి అన్నారు. గురువారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో ఆయ‌న మాట్లాడారు. చట్ట ప్రకారం జరిగే వ్యాపారం పై నిందలు వేస్తూ ఎంతో మంది కి ఉపాధి కల్పించే సంస్థల ను దెబ్బ తీసే ప్రయత్నాలు చేస్తున్నార‌న్నారు .అన్ని రకాల ప్రభుత్వ అనుమతులు తీసుకొని, చట్ట బద్దంగా, న్యాయ బద్దంగా ప్రభుత్వ నియమ నిబంధనలకు లోబడి కొనసాగుతున్న త‌న‌ వ్యాపారాలను దెబ్బ తీయడానికి త‌న‌ రాజకీయ ప్రత్యర్థులు చేస్తున్న కుట్రలు ఫలించవ‌న్నారు. త‌నను రాజకీయంగా ఎదుర్కోలేక త‌న‌మీద, త‌న‌ కంపెనీల మీద కొందరు పనిగట్టుకుని, వాస్తవాలను వక్రీకరిస్తూ దుష్ప్రచారం చేస్తున్నార‌ని పేర్కొన్నారు. తప్పుడు ప్రచారం చేసే వారిపై తీవ్ర చర్యలు తీసుకోవాలని న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాన‌ని తెలిపారు. లీగల్ నోటీసులిప్పిస్తాన‌ని సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేసే వారిపై సైబర్ పోలీసు విభాగానికి ఫిర్యాదుచేస్తాన‌న్నారు. ఒక సామాన్య మధ్య తరగతి రైతు బిడ్డనైన త‌న‌ ఉన్నతమైన ఎదుగుదలను చూసి ఓర్వ‌లేక ఇలాంటి తప్పుడు ఆరోపణలతో పబ్బం గడుపుకునే వారికి తీవ్ర నిరాశ తప్పద‌ని అని అన్నారు .

Copyright © 2026 SIRA NEWS. All rights reserved.