
సీబీఐకి కర్ణాటక రెడ్ సిగ్నల్..
సిరా న్యూస్,బెంగళూరు; సీబీఐకి కర్ణాటక ప్రభుత్వం రెడ్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్రంలోకి నో ఎంట్రీ బోర్డ్ పెట్టేసింది. సడెన్‌గా ఎందుకీ డెసిషన్…? రాష్ట్రంలోని కేసుల దర్యాప్తునకు సీబీఐకి ఇచ్చిన సాధారణ అనుమతిని ఉపసంహరించుకోవాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది. మైసూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ స్థల కేటాయింపు కేసులో సిద్ధరామయ్యపై ప్రత్యేక కోర్టు లోకాయుక్త పోలీసుల విచారణకు ఆదేశించిన కొన్ని గంటల తర్వాత ఈ పరిణామం జరిగింది. ఇదంతా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ముడా స్కాం ఎఫెక్టేనా..? అన్న చర్చ మొదలైంది.అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ స్కాం కేసులో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య చుట్టూ ఉచ్చుబిగుస్తోంది. ఇళ్ల స్థలాల కేటాయింపునకు సంబంధించి పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని, ముఖ్యమంత్రి తన సొంతవాళ్లకు ఇష్టం వచ్చినట్లు స్థలాలు కేటాయిచారంటూ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. ముడా కేసును సీబీఐకి అప్పగించాలంటూ విపక్షాలు…
