తాజా వార్తలు

khanapur: వ్యవసాయ మార్కెట్ యార్డులో మొక్క‌లు నాటిన బీజేపీ నాయ‌కులు

సిరాన్యూస్‌, ఖానాపూర్ వ్యవసాయ మార్కెట్ యార్డులో మొక్క‌లు నాటిన బీజేపీ నాయ‌కులు నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలో డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ జ‌యంతి వేడుక‌లు బీజేపీ నాయ‌కులు ఘ‌నంగా నిర్వ‌హించారు. ఈసంద‌ర్బంగా ప‌ట్ట‌ణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో బీజేపీ నాయ‌కులు మొక్కలు నాటి ఆయనకు నివాళుల‌ర్పించారు. ఈ కార్యక్రమంలో ఖానాపూర్ పట్టణ అధ్యక్షులు నాయిని సంతోష్, మండల ఉపాధ్యక్షులు ఎనుగందుల రవి, పట్టణ ప్రధాన కార్యదర్శి కొండవేనీ రమేష్, మండల ప్రధాన కార్యదర్శి పెద్ది రమేష్, బూత్ అధ్యక్షుడు పరమేష్ గౌడ్, గట్టు శ్రీనివాస్ .అంగ చందు తదితరులు పాల్గొన్నారు

Read More
6 Jul 2024, 2:15 pmsiranews.in