
చంపేస్తున్న చలి
సిరా న్యూస్,ఆదిలాబాద్; ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చలి తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. గతం వారం రోజులుగా ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోతున్నాయి. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఎముకలు కొరికే చలితో వృద్ధులు, చిన్నారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తెల్లవారుజాము నుంచే మంచు దట్టంగా అలుముకొని.. ఉదయం 9 గంటలు దాటినా సూర్యుడు కనపడటం లేదు. పొగమంచు కారణంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చలి ప్రభావంతో వృద్ధులు, చిన్నారులు, రైతులు, వ్యవసాయ కూలీలు అవస్థలు పడుతున్నారు.ఓ వైపు చలి, మరోవైపు పొగమంచుతో ఉదయం పూట బయటకు రావాలంటేనే ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా అడవులు అత్యధికంగా ఉన్నాయి. దీంతో అటవీ, ఏజెన్సీ ప్రాంతాల్లో అత్యధికంగా చలి తీవ్రత పెరిగింది. ఉదయం పూట పొగమంచు దట్టంగా అలుముకుంటోంది. దీంతో రహదారి సరిగ్గా కనబడక వాహనదారులు…
