
కోదండ… రామ్… రామ్..ఏనా
సిరా న్యూస్,హైదరాబాద్; తెలంగాణ ఉద్యమంతో ఓ వెలుగు వెలిగిన ఆచార్య కోదండరాం… రాజకీయంగా సక్సెస్ అయ్యారా? లేదా? అన్న ప్రశ్నకు ఎవరూ కచ్చితమైన ఆన్సర్ చేయలేకపోతున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో రాజకీయంగా విభేదించిన కోదండరాం… సొంతంగా పార్టీ పెట్టినా… ప్రజల నుంచి ఆశించిన మద్దతు లభించలేదు. ఐతే సొంతంగా కేసీఆర్పై పైచేయి సాధించలేకపోయిన ప్రొఫెసర్ కోదండరాం…. 2018లోనే కాంగ్రెస్తో జట్టుకట్టి కారును గ్యారేజీకి పంపాలని శ్రమించినా ఫలితం దక్కలేదు. పట్టు వదలని విక్రమార్కునిలా మరోసారి గత ఎన్నికల్లో కాంగ్రెస్తో కలిసి గులాబీ కోటను కూల్చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కు మద్దతు ప్రకటించి… ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా హస్తం పార్టీ విజయానికి దోహదపడ్డ ప్రొఫెసర్ కోదండరాంకి ఇప్పటివరకు ఎలాంటి పదవీ దక్కకపోవడంపై జన సమితి నేతల్లో తీవ్ర చర్చ సాగుతోందిఒక ఎమ్మెల్సీ, రెండు నామినేటెడ్ పోస్టుల…
