తాజా వార్తలు

Kolanu Bharati Saraswati Kshetra celebrates Vasantha Panchami : కొలను భారతి సరస్వతి క్షేత్రంలో ఘనంగా వసంత పంచమి

సిరా న్యూస్,నంద్యాల; విశ్వానికి, ప్రపంచానికి జ్ఞానాన్ని ప్రసాదించే చదువుల తల్లి, అక్షరాల ఆదిదేవత, విద్యాది దేవత, పుస్తక పాణి, యజ్ఞప్రదాయని అయిన శ్రీ సరస్వతి దేవి జన్మదిన మాఘశుద్ధ వసంత పంచమి. సరస్వతి అమ్మవారు ఈ ఘడియల్లోనే వేదాలకు ముందు విశ్వ సృష్టి క్రమంలో బ్రహ్మ చేతుల మీదుగా జన్మించిన ఈరోజును శ్రీ పంచమి, మదన పంచమి పేరుతో సకల దేవతలు ఆరాధించారు. భారతదేశంలో ఉన్న మూడు సరస్వతి ఆలయాలలో మన రాష్ట్రంలో నల్లమల్ల అరణ్యం ఆత్మకూరు అటవీ, రెవెన్యూ డివిజన్ పరిధిలో వెలసిన శ్రీ కొలనుభారతి సరస్వతి క్షేత్రానికి వేలాదిమంది భక్తులు తరలి వచ్చారు. విశ్వంలోని ఐదుగురు ప్రకృతి వన దేవతల్లో సరస్వతి అమ్మవారిది మూడవస్థానం సప్త ఋషులు ఈ ప్రాంతంలో యజ్ఞాలు చేసే క్రమంలో ఆటంకం ఏర్పడింది. దీంతో సరస్వతి అమ్మవారు స్వయంగా కొలనుభారతిలో…

Read More
14 Feb 2024, 4:17 pmsiranews.in