Telugu Online News Daily
https://siranews.in/
https://siranews.in/
Date of Publish : 10 August 2024, 5:27 pmEditor : SIRA NEWS
Kovvuri Chandrasekhar Reddy: సామర్లకోట తహసీల్దార్‌గా కొవ్వూరి చంద్రశేఖర్ రెడ్డి

సిరాన్యూస్,సామర్లకోట
సామర్లకోట తహసీల్దార్‌గా కొవ్వూరి చంద్రశేఖర్ రెడ్డి
సామర్లకోట తహసీల్దార్‌గా కొవ్వూరి చంద్రశేఖర్ రెడ్డి శుక్రవారం రాత్రి బాధ్యతలు స్వీకరించారు. ఈసందర్భంగా శనివారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో కాకినాడ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ల్యాండ్ సూపరింటెండెంట్ గా చేసినట్లు తెలిపారు. జనవరిలో ఎన్నిక ల బదిలీలో భాగంగా ఏలూరు జిల్లాకు బదిలీ చేసారని, ప్రస్తుతం సామర్లకోట తహసీల్దార్ గా నియమిస్తూ కలెక్టరు షాన్ మోహన్ ఉత్తర్వులు జారీ చేశారు అని తెలిపారు. తాను డిగ్రీ పూర్తి చేసిన వెంటనే ఉద్యోగం వచ్చిందని తెలిపారు.అటెండర్ స్థాయి నుంచి తహసీల్దార్ స్థాయి వరకు ఎన్నో ఒడిదుడుకులను అధిగమించి ముందుకు వచ్చారని చెప్పారు.సమస్య ఏదైనా మొదటి స్టేజ్ లోనే తెలిస్తే పరిష్కారం సులువు అవుతుందని పేర్కొన్నారు.
