
ప్రాంతీయ పార్టీగానే భావిస్తున్న కేటీఆర్
సిరా న్యూస్,హైదరాబాద్; తెలంగాణ రాష్ట్ర సమితి .. తెలంగాణ పార్టీ. ప్రజలు తమ పార్టీ అని ఓన్ చేసుకున్న పార్టీ. తెలంగాణ ఇంటి పార్టీగా కేసీఆర్ ప్రజల మనసుల్లోకి తీసుకెళ్లారు. తర్వాత ఆ పార్టీ పేరును భారత రాష్ట్ర సమితిగా మార్చారు. అంటే పేరుతో తెలంగాణను తీసేసి జాతీయ వాదం తెచ్చారు. తమది జాతీయ పార్టీ అని ప్రకటించారు. ఇతర రాష్ట్రాల్లో పార్టీ విస్తరణ కోసం ప్రయత్నాలు చేశారు. కానీ తెలంగాణలోనే అధికారం కోల్పోవడం.. ఒక్క ఎంపీ సీటు కూడా గెలవకపోవడంతో ఆ ప్రయత్నాలన్నీ నీరుగారిపోయాయి.ఇప్పుడు తమ పార్టీ జాతీయ పార్టీ కానే కాదని.. లోకల్ పార్టీ అని కేటీఆర్ నమ్మించేందుకు గట్టిగా ప్రయత్నిస్తున్నారు. లోక్సభ ఎన్నికల్లో కేటీఆర్ ప్రచార అస్త్రం.. రెండు జాతీయ పార్టీలు తమ హైకమాండ్ ఆలోచనల మేరకు పని చేస్తాయని అదే ప్రాంతీయ…
