
రాంగ్ ట్రాక్ లో కేటీఆర్…?
సిరా న్యూస్,హైదరాబాద్; లోక్‌సభ స్థానాల వారీగా చేస్తున్న సమీక్షా సమావేశాల సందర్భంగా అగ్రనేతల వ్యవహారశైలిపై బీఆర్ఎస్ క్యాడర్‌లో అసంతృప్తి కనిపిస్తోంది. కేటీఆర్ నియోజకవర్గాల వారీ సమీక్ష సమావేశాల్లో రేవంత్ రెడ్డిని తిట్టి… ఎన్నికల్లో దున్నిపారేస్తామని ప్రసంగించి వెళ్లిపోతున్నారు. గ్రౌండ్ లెవల్లో పరిస్థితిని అర్థం చేసుకునేందుకు ప్రయత్నించడం లేదు. కనీసం సమీక్షకు ఆహ్వానించిన వారి అభిప్రాయాలు తెలుసుకునేందుకు కూడా ఏ మాత్రం ప్రయత్నించడంలేదు. దీంతో ద్వితీయ శ్రేణి క్యాడర్ లో అసహనం పెరిగిపోతోంది. పరిస్థితి దిగజారిపోతూంటే.. కేటీఆర్ సమీక్షల పేరుతో పిలిచి .. ఇలా ప్రసంగాలు ఇచ్చి పంపించేస్తూండటంతో చాలా మంది ఆసక్తి కోల్పోతున్నారు.సికింద్రాబాద్, మల్కాజిగిరి, చేవెళ్ల ఎంపీ స్థానాలపై హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో సమీక్షా సమావేశాలను నిర్వహించారు. అభ్యర్థులు, ఇతర సీనియర్ నేతలు హాజరయ్యారు. కానీ అసలు సమీక్ష అంట ూఏమీ జరగలేదు. ఎంపీ స్థానంలో బలాబలాలేంటి..?…
