Telugu Online News Daily
https://siranews.in/
Date of Publish : 14 March 2024, 4:45 pmEditor : Sira News

భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కార్మికులకే లేబర్ ఇన్సూరెన్స్ కార్డులు

-పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు చిలువేరు స్వామి

సిరా న్యూస్,కమాన్ పూర్;
భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కార్మికులకు మాత్రమే లేబర్ ఇన్సూరెన్స్ కార్డు వర్తిస్తుందని భవన నిర్మాణ కార్మిక సమైక్య సంఘం పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు చిలువేరు స్వామి అన్నారు.సోషల్ మీడియాలో లేబర్ ఇన్సూరెన్స్ కార్డుకు గవర్నమెంట్ ఉద్యోగులు తప్ప తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ అర్హులు అని తప్పుడు ప్రచారం జరుగుతుందని అదంతా అవాస్తవమని అన్నారు. తెలంగాణ బిల్డింగ్ మరియు ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు ద్వారా మాత్రమే లేబర్ ఇన్సూరెన్స్ కార్డులు కార్మిక శాఖ అధికారి అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ జారీ చేస్తారన్నారు.కొంతమంది నాయకులు వారి స్వార్థ ప్రయోజనాల కోసం తప్పుడు ప్రచారం చేస్తూ నిజమైన కార్మికులు పొందవలసిన సంక్షేమ పథకాలను ప్రక్కత్రోవ పట్టిస్తున్నారని అన్నారు. మా కార్మికుల పొట్టకూట్టకుండా వెల్ఫేర్ బోర్డు నుండి రావలసిన సంక్షేమ పథకాలు గాని గత ప్రభుత్వం ఇచ్చిన హామీలు గాని నాయకులు మా కార్మికుల పక్షాన ప్రభుత్వాన్ని ఒప్పించి కార్మికులకు న్యాయం చేయాలని అన్నారు. సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు ప్రచారాన్ని చూసి కార్మికులు భయభ్రాంతులకు గురవుతున్నారని అలా ప్రచారం చేసే వారిపై అధికారులు తగు చర్యలు తీసుకోవాలన్నారు.

Copyright © 2026 SIRA NEWS. All rights reserved.