
క్యాంప్ ఆఫీస్ గా లేక్ వ్యూ గెస్ట్ హౌస్
సిరా న్యూస్,హైదరాబాద్; ఇకపై సీఎం క్యాంప్ ఆఫీస్ గా లేక్ వ్యూ గెస్ట్ హౌస్? మారనుందా? రాజ్ భవన్ రోడ్డులోని లేక్ వ్యూ గెస్ట్ హౌస్ ను సీఎం రేవంత్ రెడ్డి క్యాంపు కార్యాలయంగా వినియోగించనున్నారా? అవుననే అంటున్నాయి అధికార వర్గాలు. ప్రస్తుం సీఎం జూబ్లీహిల్స్ లోని తన నివాసం నుంచే పాలన సాగిస్తున్నారు. అయితే సమావేశాలకు ఇబ్బందికరంగా మారడంతో ‘లేక్ వ్యూ’ గెస్ట్ హౌస్ ని వినియోగించాలని యోచిస్తున్నారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. జూన్ 2 తర్వాత ఆ భవనాన్ని ఏపీ నుంచి ప్రభుత్వం స్వాధీనం చేసుకోనుంది. ఆ తర్వాత క్యాంప్ ఆఫీస్ గా ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం.తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుచేసిన జూన్ 2 వ తేదీతో పదేళ్లు పూర్తవుతుంది. ఇప్పటిదాకా ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ ఇకపై తెలంగాణకు మాత్రమే రాజధానిగా మారనుంది. దీంతో…
