
సాహితీ లక్ష్మీనారాయణకు బిగిస్తున్న ఉచ్చు
సిరా న్యూస్,హైదరాబాద్; సాహితీ ఇన్ఫ్రా కేసులో ఈడీ విచారణ మొదలైంది. ఐదు రోజులపాటు లక్ష్మి నారాయణను ఈడీ ప్రశ్నించనుంది. మొదటిరోజు పలు ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేసింది. సాహితీ ఇన్ఫ్రా పేరు మీద వేల మంది దగ్గరి కోట్లాది రూపాయలు వసూలు చేశాడు లక్ష్మినారాయణ. చాలా డబ్బును సొంతానికి వాడేసుకున్నాడు. చెప్పిన టైమ్‌కు కస్టమర్లకు ఇళ్లు అందించలేదు. దీంతో వారంతా సీసీఎస్ పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదైంది. అధికారులతో కుమ్మక్కై, తప్పించుకునే ప్రయత్నం చేశాడు. కానీ, ఈడీ ఎంట్రీతో కేసు కీలక మలుపు తిరిగింది.రూ. వేల కోట్ల స్కామ్ కావడంతో తర్వాత ఈడీ ఎంటర్ అయింది. కేసు నమోదు చేసి పీఎంఎల్ఏ యాక్ట్ కింద సెప్టెంబర్ 29న లక్ష్మినారాయణను అరెస్ట్ చేసింది. అతడ్ని కస్టడీకి ఇవ్వాలని కోర్టును కోరగా, గ్రీన్ సిగ్నల్ వచ్చింది. సాహితీ ఇన్ఫ్రా స్కామ్‌లో ఇంకా…
