
ఈ నెల 26 వ తేదీన ఆడుదాం ఆంధ్ర క్రీడల నిర్వహణ ప్రారంభం
క్రీడల నిర్వహణకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయాలి జిల్లా కలెక్టర్ డా.జి.సృజన సిరా న్యూస్,కర్నూలు;, ఈ నెల 26 వ తేదీన ఆడుదాం ఆంధ్ర క్రీడల నిర్వహణ ప్రారంభం కానున్నందున, పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ డా.జి.సృజన అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాలులో ఆడుదాం ఆంధ్ర నిర్వహణ పై మండల స్పెషల్ ఆఫీసర్ లతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ క్రీడల నిర్వహణలో ఎలాంటి పొరపాట్లు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ప్లేయర్ రిజిస్ట్రేషన్ దాదాపు పూర్తి అయిందని, ఇక టీమ్స్ ఏర్పాటు, గ్రౌండ్స్ గుర్తింపు పై దృష్టి పెట్టాలని కలెక్టర్ ఆదేశించారు..ప్రతి సచివాలయం పరిధిలో 5 క్రీడలను కచ్చితంగా నిర్వహించాలన్నారు.. అందుకనుగుణంగా గ్రౌండ్స్ ను గుర్తించి ఆడడానికి వీలుగా ఉండేలా వాటిని సిద్ధం చేయాలన్నారు..అలాగే ఆయా…
