తాజా వార్తలు

అయోధ్య‌లో కొలువుదీరిన రామ్‌లల్లా..

మ‌ధ్యాహ్నం 12.29 నిమిషాల‌కు ముఖ్య ప్రాణ ప్ర‌తిష్ట ప్రాణ‌ప్ర‌తిష్ట చేసిన మోదీ రామ నామంతో మారుమోగిన ఆల‌య ప‌రిస‌రాలు జైజైరాం రాజారాం.. అంటూ త‌న్మ‌య‌త్వంలో తేలిపోయిన  రామ‌భ‌క్తులు సిరా న్యూస్,అయోధ్య‌; కౌస‌ల్య రాముడు.. అయోధ్య‌లో కొలువుదీరాడు. బాలరాముడి విగ్ర‌హాన్ని కొత్త‌గా నిర్మించిన ఆల‌యంలో ప్ర‌తిష్టించారు. ప్ర‌ధాని మోదీ చేతుల మీదుగా ప్రాణ ప్ర‌తిష్ట జ‌రిగింది. భార‌త కాల‌మానం ప్ర‌కారం స‌రిగ్గా మ‌ధ్యాహ్నం 12.29 నిమిషాల‌కు ముఖ్య ప్రాణ ప్ర‌తిష్ట కార్య‌క్ర‌మాన్ని నిర్మించారు. సుమారు 84 సెక‌న్ల పాటు అస‌లు క్ర‌తువును నిర్వ‌హించారు. కీల‌క‌మైన ఈ 84 సెక‌న్ల స‌మ‌యంలోనే రాముడి మూర్తికి ప్రాణ ప్ర‌తిష్ట చేశారు. రాముడి విగ్ర‌హం కండ్ల‌కు ఉన్న వ‌స్త్రాన్ని ప్ర‌ధాని తొల‌గించారు. ఆ త‌ర్వాత పుష్పాల‌తో రామున్ని పూజించారు. ప్రాణ ప్ర‌తిష్ట స‌మ‌యంలో 50 శంఖాలు ఊదారు. రామ నామంతో ఆల‌య ప‌రిస‌రాలు…

Read More
22 Jan 2024, 5:55 pmsiranews.in