Telugu Online News Daily
https://siranews.in/
Date of Publish : 13 February 2024, 1:53 pmEditor : SIRA NEWS

Loka Praveen Reddy: గ్రామాల అభివృద్ధి ప్రధాని నరేంద్ర మోడీతోనే సాధ్యం…

సిరా న్యూస్, ఆదిలాబాద్:

గ్రామాల అభివృద్ధి ప్రధాని నరేంద్ర మోడీతోనే సాధ్యం…

– బిజెపి జిల్లా అధికార ప్రతినిధి లోక ప్రవీణ్ రెడ్డి

గ్రామాల అభివృద్ధి భారత ప్రధాని నరేంద్ర మోడీ తోనే సాధ్యమని బిజెపి పార్టీ ఆదిలాబాద్ జిల్లా అధికార ప్రతినిధి లోక ప్రవీణ్ రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలోని సాంగ్వి గ్రామంలో ఉపాధి హామీ నిధులు రూ. 5 లక్షలతో నిర్మించనున్న సిసి రోడ్డు పనులకు స్థానిక నాయకులు, అధికారులు, గ్రామస్తులతో కలిసి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కేంద్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు నేరుగా నిధులు మంజూరు చేయడంతో నేడు గ్రామాలు అభివృద్ధి బాటలో పయనిస్తున్నాయని ఆయన అన్నారు. గతంలో గ్రామాల్లో కనీస మౌలిక వసతులు లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడేవారని ఆయన గుర్తు చేశారు. ఉపాధి హామీ నిధులతో సిసి రోడ్లు, డ్రైనేజీలు, ఇతర మౌలిక వసతులు కల్పించడం జరుగుతోందని అన్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో అత్యధిక ఎంపీ స్థానాలు బిజెపి కైవసం చేసుకోవడం తద్యమని అన్నారు. అత్యధిక ఎంపీ స్థానాలు గెలిపిస్తే కేంద్రంలో సైతం తెలంగాణకు ప్రత్యేక గుర్తింపు లభించడమే కాకుండా కేంద్రం నుండి రాష్ట్రానికి మరిన్ని నిధులు వచ్చే అవకాశం ఉందని అన్నారు. త్వరలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి బిజెపి అభ్యర్థులను ఎంపీగా గెలిపించాలని కోరారు. తెలంగాణ ముద్దుబిడ్డ, భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు భారతరత్న ప్రకటించడం యావత్ తెలంగాణకు గర్వకారణమని అన్నారు. పీవీ నరసింహారావు సేవలు గుర్తించిన కేంద్ర ప్రభుత్వానికి ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ విట్టల్ రెడ్డి, నాయకులు రమేష్ రెడ్డి, అశోక్ రెడ్డి, గాలెన్న, పొచ్చిరాం, తరుణ్, వినోద్ తదితరులు పాల్గొన్నారు.

Copyright © 2026 SIRA NEWS. All rights reserved.