
దీపావళికి మేకిన్ ఇండియా….
సిరా న్యూస్,న్యూఢిల్లీ; బతుకమ్మ మొదలైంది. ఈ ప్రకారం పండుగల సీజన్ ప్రారంభమైనట్టే. ఈ నవరాత్రి వేడుకలను దేశవ్యాప్తంగా జరుపుకుంటారు. ఒక్కో ప్రాంతంలో తక్కువ తీరుగా నిర్వహిస్తుంటారు. దసరా, దీపావళి, చాట్ పూజలతో భారతదేశం మొత్తం పండగ వాతావరణం నెలకొంటుంది. అయితే ఈ పండగలవేళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇటీవల మన్ కీ బాత్ కార్యక్రమంలో మాట్లాడారు. ఈ సందర్భంగా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. మనం నిర్వహించుకునే పండుగలకు.. మనం తయారు చేసే వస్తువులను మాత్రమే వాడాలని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. అయితే మోడీ చేసిన వ్యాఖ్యలను జాగ్రత్తగా పరిశీలిస్తే.. అవి చైనాకు చెక్ పెట్టేలాగా ఉన్నాయని తెలుస్తోంది.. త్వరలో జరుపుకోబోయే దీపావళి పండుగను మేడ్ ఇన్ ఇండియా వస్తువులతోనే నిర్వహించుకోవాలని ప్రధాని పిలుపునిచ్చారు. ఇటీవల గణేష్ నవరాత్రి ఉత్సవాలలోనూ దేశీయంగా తయారైన వస్తువులనే మెజారిటీ ప్రజలు వాడారు.…
