తాజా వార్తలు

ప్రసన్నం చేసుకొనేందుకు మల్లారెడ్డి కష్టాలు

సిరా న్యూస్,హైదరాబాద్; తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక ఇబ్బంది ఎదుర్కొంటున్న ఎమ్మెల్యే మల్లారెడ్డి. బీఆర్‌ఎస్‌ నుంచి మేడ్చల్‌ బరిలో నిలిచి గెలిచిన మల్లారెడ్డి గెలిచినా.. ఆ పార్టీ మాత్రం అధికారంలోకి రాలేదు. దీంతో మల్లారెడ్డికి కష్టాలు మొదలయ్యాయి. ప్రజావాణిలో మల్లారెడ్డి కబ్జాలు, దౌర్జన్యాలపై ప్రజలు, సంఘాల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. వెతకబోయిన తీగ కాలికి తగిలినట్లుగా మల్లారెడ్డిని ఎలా పట్టుకోవాలని చూస్తున్న రేవంత్‌ సర్కార్‌క ఈ ఫిర్యాదులే ఆధారమయ్యాయి. దీంతో మల్లారెడ్డి కబ్జాలపై ప్రభుత్వం కొరఢా ఝళిపిస్తోంది. ఇటీవలే మల్లారెడ్డి కొడుకు భద్రారెడ్డికి సంబంధించిన కళాశాల భవనాన్ని కూడా అధికారులు కూల్చివేశారు. కబ్జాలన్నీ బయలపెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి.మల్లారెడ్డి ఆస్తులపై దర్యాప్తు వేగవంతం కావడంతో ఆయన వెంటనే సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డిని కలిశారు. తన ఆస్తులపై దాడులు జరుగకుండా సీఎంకు విన్నవించాలని కోరారు. కక్షసాధింపు చర్యలు సరికావని…

Read More
18 Mar 2024, 11:07 amsiranews.in