తాజా వార్తలు

Manda Suresh: మృతి చెందిన‌ మండ సురేశ్ కు గ్రామస్తుల సహాయంతో అంత్యక్రియలు

సిరా న్యూస్‌, కాల్వ శ్రీరాంపూర్  మృతి చెందిన‌ మండ సురేశ్ కు గ్రామస్తుల సహాయంతో అంత్యక్రియలు కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలం లోని మర్రివానీపల్లి శివారులో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదం లో తీవ్రంగా గాయపడి ఆసుపత్రి లో చికిత్స పొందుతున్న నిరుపేద కుటుంబానికి చెందిన మండ సురేశ్ (30)మృతి చెందాడు. ఇతని గ్రామం మీర్జoపేట శ్రీరాంపూర్ మండలం భార్య అంజలి కొడుకు చింటూ (5)బిడ్డ చిట్టీ (3)ఉన్నారు. దహన సంస్కారాల కోసం గ్రామంలో సుమారు 30000రూపాయలు చందాలు వేసుకుని అంత్యక్రియలు చేశారు. ఈకార్యక్రమంలో మాజీ ఎంపీపీ గోపగాని సారయ్య గౌడ్, కాంగ్రెస్‌ మండల అధ్యక్షులు గజానావేనా సదయ్య, మాజీ ఎంపీటీసీ పోశాల సదానందం గౌడ్, ఉయ్యాల పోచాలు, మొగిలి సదానందం, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Read More
21 Sep 2024, 8:08 pmsiranews.in