
మళ్లీ మొదటికొచ్చిన మణిపూర్
సిరా న్యూస్; కుకీ, మెయితీ తెగల మధ్య చోటు చేసుకున్న ఘర్షణలు కాస్తా గతేడాది ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్ను ఏ విధంగా రణరంగంగా మార్చాయో అందరికీ తెలిసిందే. వందల మంది ప్రాణాలు కోల్పోగా.. వేలాదిమంది నిరాశ్రయులయ్యారు. ఎన్నో దారుణ ఘటనలు చోటు చేసుకున్నాయి. అయితే గత కొంత కాలంగా మణిపూర్లో డ్రోన్ దాడులు సంచలనం సృష్టించగా.. తాజాగా జరిగిన ఓ ఘటన మళ్లీ హింసాత్మక ఘటనలకు ఆజ్యం పోశాయి. తాజాగా జిరిబం జిల్లాలో శనివారం ఇరువర్గాల మధ్య చోటు చేసుకున్న కాల్పుల్లో మొత్తం ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. గత వారం రోజులుగా మణిపూర్లో హింస చెలరేగుతుండటం మరోసారి తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.జిరిబం జిల్లాకు సమీపంలో ఉన్న ఓ ఇంట్లో చొరబడిన మిలిటెంట్లు.. గాఢనిద్రలో ఉన్న ఓ వ్యక్తిని కాల్చి చంపేశారు. అనంతరం విషయం తెలుసుకుని పోలీసులు రంగంలోకి…
