Telugu Online News Daily
https://siranews.in/
https://siranews.in/
Date of Publish : 16 February 2024, 2:03 pmEditor : SIRA NEWS
Manjuvani: పంటలో సస్యరక్షణ చర్యలు చేపట్టాలి

సిరా న్యూస్, కరీంనగర్
పంటలో సస్యరక్షణ చర్యలు చేపట్టాలి
* ఉద్యనవాన శాఖ అధికారి మంజువాణి
* రైతులకు అవగాహన సదస్సు
పంటలో రైతులు సస్యరక్షణ చర్యలు చేపట్టాలని ఉద్యనవాన శాఖ అధికారి మంజువాణి అన్నారు.శుక్రవారం చిగురుమామిడి మండలంలోని బొమ్మనపల్లి గ్రామంలోని రైతు వేదికలో రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడారు. పంటల సస్యరక్షణ, మామిడి తోటల్లో వస్తున్న చీడ పురుగుల నివారణ కోసం చేపట్టాల్సిన చర్యల గురించి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో బొమ్మనపల్లి వ్యవసాయ విస్తరణ అధికారి అఖిల, ఎంపీటీసీ ఉపసర్పంచ్, ప్రవీణ్, ప్రజా ప్రతినిధులు రైతులు పాల్గొన్నారు.
